Posts

Novak Djokovic నిజాయతీ.. కుర్ర కోచ్‌కి గురుదక్షిణగా తన రాకెట్

Image
https://ift.tt/3pSFTFz ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మరోసారి తన నిజాయతీతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. సిట్సిపాస్‌తో తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లని చేజార్చుకున్న జకోవిచ్.. అనంతరం పుంజుకుని విజేతగా నిలిచాడు. అయితే.. తాను రెండు సెట్లు చేజార్చుకుని వెనకబడిన దశలో స్టాండ్స్‌లోని ఓ కుర్రాడు తనకి సాయం చేసినట్లు జకోవిచ్ నిజాయతీగా అంగీకరించాడు. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ కుర్రాడికి తన రాకెట్‌ని జకోవిచ్ బహుమతిగా అందజేశాడు. ‘‘ఆ కుర్రాడు నాకు కోర్టులో లైవ్ కోచింగ్ ఇచ్చాడు. సిట్సిపాస్‌‌ని ఎక్కువగా బ్యాక్‌హ్యాండ్‌పై ఆడించు.. సర్వీస్ నిలబెట్టుకో లాంటి సూచనలు నా చెవిన పడ్డాయి. రెండు సెట్లు చేజారిన తర్వాత మళ్లీ నేను గేమ్‌లో పుంజుకునేందుకు ఆ కుర్రాడి సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ కారణంగానే మ్యాచ్ ముగిసిన తర్వాత నా రాకెట్‌ని అతనికి ఇచ్చా’’ అని జకోవిచ్ వెల్లడించాడు. ఆరాధ్య ఆటగాడి నుంచి ప్రశంసలే కాకుండా రాకెట్ కూడా దక్కడంతో ఆ కుర్రాడు ఆనందంతో గంతులేస్తూ.. భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో ఆ కుర్ర కోచ్‌ గురించి జకోవిచ్ ప్రత...

Barbora Krejcikova ఫైనల్ తొలిసారే టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విజేతగా చెక్ అమ్మాయి

Image
https://ift.tt/3zlR6mk ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ క్రీడాకారిణి గెలుపొందింది. శనివారం హోరాహోరీగా ఫైనల్లో 6-1, 2-6, 6-4తో రష్యాకు చెందిన 31వ సీడ్‌ పవ్లిచెంకోవాపై విజయం సాధించింది. ఇద్దరికీ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌ చేరడం తొలిసారి కాగా.. క్రెజికోవా-పవ్లిచెంకోవా హోరాహోరీగా తలపడ్డారు. ఆట ఆరంభంలో ప్లవిచెంకోవా సర్వీసు నిలబెట్టుకుని పాయింట్ సాధించినా.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బార్బారా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. పదే పదే నెట్ పాయింట్లు సాధించిన క్రెజికోవా నాలుగు, ఆరు గేముల్లో పవ్లిచెంకోవా సర్వీస్‌‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌‌ను సునాయాసంగా గెలిచింది. కానీ రెండో సెట్‌లో పవ్లిచెంకోవా విజృంభించింది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచిన పవ్లిచెంకోవా అదే జోరుతో 6-2తో సెట్‌‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక చివరి సెట్ ఇద్దరూ మరింత దూకుడు ప్రదర్శించారు. ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంతో స్కోర్లు సమం అవుతూ వచ్చాయి. ఇద్దరూ బ్రేక్‌ పాయింట్లు సాధించడంలో విఫలమయ్యారు. కానీ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన బార్బారా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రెజికోవా...

దిగ్గజ బాక్సర్ డింకో సింగ్ మృతి.. ఆ అలవాటుతో గాడితప్పిన కెరీర్

Image
https://ift.tt/3gsRruH భారత దిగ్గజ బాక్సర్ (42) అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న డింకో సింగ్.. ఇటీవల కామెర్లు రావడంతో తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మణిపూర్‌లో కన్నుమూశాడు. బ్యాంకాక్‌లో 1998లో జరిగిన ఆసియా క్రీడల్లో ఒలింపిక్స్ విజేతల్ని వరుసగా ఓడించిన డింకో సింగ్ భారత్‌కి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఆసియా క్రీడల్లో డింకో సింగ్ రింగ్‌లో కదిలిన తీరు, విసిరిన పంచ్‌లు ఎంతో మంది బాక్సర్లకి స్ఫూర్తినిచ్చింది. కానీ.. ఆ తర్వాత డింకో సింగ్ మద్యానికి బానిసవగా.. క్రమంగా అతని కెరీర్ కూడా గాడి తప్పింది. ఇంఫాల్‌లో పుట్టిన డింకో సింగ్.. 10 ఏళ్ల వయసులోనే సబ్ జూనియర్ విభాగంలో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో ఒలింపిక్స్ విజేతల్ని సైతం మట్టికరిపించిన డింకో సింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. కానీ.. ఆ క్రేజ్‌ని డింకో సింగ్ కాపాడుకోలేకపోయాడు. మద్యం అలవాటు చేసుకున్న డింకో సింగ్.. 2000లో జరిగిన ఒలింపిక్స్, 2002లో జరిగిన కామెన్వెల్త్ క్రీడల్లో కనీసం ఫస్ట్ రౌండ్‌ని కూడా దాటలేకపోయాడు. 1998లో డింకో సింగ్‌ని అర్జున అవార్...

రెజ్లర్ సుశీల్‌ కుమార్‌కి జైల్లో సపరేట్ సెల్.. జతేది గ్యాంగ్‌ కారణమా..?

Image
https://ift.tt/34LqaOP భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కి జైల్లో సపరేటు సెల్‌ని అధికారులు కేటాయించారు. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో మే 4న యువ రెజ్లర్ సాగర్‌పై , అతని సహచరులు దాడి చేశారు. దాంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్ (23) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాడి తర్వాత 22 రోజులు పరారీలో ఉన్న సుశీల్‌ని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం అతను 9 రోజులు జ్యుడిషల్ కస్టడీలో ఉన్నాడు. ఈ మేరకు ఢిల్లీలోని మండోలి జైలుకి అతడ్ని తరలించారు. జైల్లో సుశీల్ కుమార్‌కి ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం అతని లాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్యాంగ్‌స్టర్‌ జతేదికి సాగర్ సన్నిహితుడు కావడంతో జైల్లోని సుశీల్ కుమార్‌‌ని అతను ఏమైనా చేస్తాడేమో..? అని లాయర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో జైల్లో సుశీల్ కుమార్‌‌ని ఇతర ఖైదీలతో కాకుండా సపరేట్ సెల్‌లో ఉంచాలని లాయర్ డిమాండ్ చేశాడు. అయితే.. ఎట్టకేలకి లాయర్ ప్రయత్నాలు ఫలించాయి. సెక్యూరిటీ రీజన్స్‌తోనే సుశీల్ కుమార్‌‌‌‌‌కి సపరేట్ సెల్‌ కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. ‘‘సుశీల్ కుమార్‌కి ఇతర ఖైదీలకి ఇచ్చే భోజనాన్నే జైల్లో ఇస్తున్న...

ఆసుపత్రిలో మళ్లీ చేరిన మిల్కాసింగ్.. ఐసీయూలో ఉంచి చికిత్స

Image
https://ift.tt/3fP2r6B భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్కాసింగ్ మే 20న కరోనా వైరస్ బారినపడ్డాడు. అయితే.. చండీగఢ్‌లోని ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి తొలుత చికిత్స తీసుకున్న 91 ఏళ్ల మిల్కాసింగ్.. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులకే మొహాలిలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న ఈ ఫ్లయింగ్ సిఖ్.. గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పటికీ.. వైద్యుల సూచనల మేరకు ఆక్సిజన్ సాయం తీసుకుంటూ ఉన్నాడు. కానీ.. గురువారం అనూహ్యంగా మిల్కాసింగ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా కనిపించడంతో వెంటనే ఐసీయూకి తరలించిన వైద్యులు.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మిల్కాసింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలకి మించి రాణించిన స్వర్ణం గెలి...

జైల్లోని రెజ్లర్ సుశీల్‌ కుమార్‌కి ఆ గ్యాంగ్‌తో ప్రాణహాని: లాయర్ కొత్త వాదన

Image
https://ift.tt/3wSuQ1h భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కి జైల్లో జతేది గ్యాంగ్‌తో ప్రాణహాని ఉందని అతని లాయర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో యువ రెజ్లర్ సాగర్‌ (23)పై , అతని సహచరులు దాడి చేయగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు. దాంతో.. 22 రోజులు పోలీసులకి దొరక్కుండా పరారీలో ఉన్న సుశీల్.. ఎట్టకేలకి మీరట్‌లో అరెస్టయ్యాడు. జైల్లో ఉన్న సుశీల్ కుమార్‌కి జతేది గ్యాంగ్‌తో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అతని లాయర్.. సుశీల్‌కి సపరేటు సెల్ కేటాయించాలని డిమాండ్ చేశాడు. సుశీల్ అజయ్‌ ఫ్రెండ్స్‌కాగా.. అజయ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సాగర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో సుశీల్ ఇంట్లోనే సాగర్ అద్దెకి ఉండేవాడు. దాంతో.. సాగర్‌కి వార్నింగ్ ఇచ్చిన సుశీల్.. ఇల్లు ఖాళీ చేయించాడు. దాంతో.. సాగర్ నేరుగా జతేది గ్యాంగ్‌‌ని సంప్రదించగా.. గొడవ ముదిరింది. ఈ క్రమంలో సాగర్‌పై దాడి చేసిన సుశీల్.. అతని మృతికి కారణమయ్యాడు. జైల్లో ఉన్న సుశీల్ కుమార్‌‌ని చంపేందుకు జతేది గ్యాంగ్ కుట్ర చేస్తోందని ఆరోపించిన సుశీల్ లాయర్.. ఇతర ఖైదీలతో కాకుండా సపరేటుగా అతనికి సెల్‌ని కేటాయించాలని డి...

Wrestler Murder Case: బట్టలు, సెల్‌ఫోన్‌ని అక్కడ దాచిన సుశీల్ కుమార్

Image
https://ift.tt/3i5zgOa యువ రెజ్లర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్‌ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా హరిద్వార్‌కి తరలించారు. మే 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో సుశీల్ కుమార్ తన గ్యాంగ్‌తో కలిసి యువ రెజ్లర్ సాగర్ (23), అతని స్నేహితుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. సాగర్‌పై దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ 22 రోజుల తర్వాత పోలీసులకి చిక్కాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే సుశీల్‌ కుమార్‌తో క్రైమ్ సీన్‌ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సమయంలో సుశీల్‌కి సాయం చేసిన వారిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు సుశీల్ కొన్ని రోజులు హరిద్వార్‌లో ఉన్నట్లు గుర్తించి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. సాగర్‌పై దాడి తర్వాత హరిద్వార్ వెళ్లిపోయిన సుశీల్ కుమార్.. అతను ఆసుపత్రిలోనే కన్నుమూయడంతో.. దాడి సమయంలో తాను ధరించిన బట్టలు, వాడిన సెల్‌ఫోన్‌ని హరిద్వార్‌లోనే పాతిపెట్టినట్లు విచా...