Wrestler Sushil Kumar ఆచూకీ చెబితే రూ. 1 లక్ష రివార్డ్.. మరో ఆఫర్ కూడా
https://ift.tt/2Rio0TV
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత సీనియర్ రెజ్లర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. సాగర్ అతని మిత్రులపై సుశీల్ కుమార్ టీమ్ హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ దాడిలో సాగర్ తలకి తీవ్ర గాయమవగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సాగర్ మృతి చెందిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలించిన పోలీసులు.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దాంతో.. గత వారం ఢిల్లీ కోర్డు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ.. సుశీల్ కుమార్ గురించి సమాచారం మాత్రం తెలియరాలేదు. ఇక ఆఖరి అస్త్రంగా ఢిల్లీ పోలీసులు రివార్డ్ ప్రకటించారు. సుశీల్ కుమార్ ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అతనితో పాటు ఈ కేసులో ఉన్న అసోషియేట్ అజయ్ గురించి సమాచారం ఇచ్చినా రూ.50,000 రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటనని విడుదల చేశారు. వాస్తవానికి సుశీల్ కుమార్‌తో సాగర్‌కి మంచి సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మోడల్ టౌన్ ఏరియాలో సుశీల్ ఇంట్లోనే అద్దెకి ఉన్న సాగర్.. ఇటీవల ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగి.. అది హత్యకి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటికే సీరియస్‌గా స్పందించింది. గతంలో రెజ్లర్లంటే గూండాలనే వారని చెప్పుకొచ్చిన సమాఖ్య.. ఇప్పుడిప్పుడే రెజ్లర్లపై గౌరవం పెరుగుతోందని వెల్లడించింది. కానీ.. తాజాగా సుశీల్ కుమార్ గొడవ.. మళ్లీ రెజ్లర్ల పరువు తీసిందని సమాఖ్య పెదవి విరిచింది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment