భారత క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రెండు వారాల్లోనే అమ్మ, అక్క మృతి
https://ift.tt/3vPVY0G
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత మహిళా క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేద కృష్ణమూర్తి అమ్మ, అక్క కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. కర్ణాటకలోని కాడూర్‌లో వేద కృష్ణమూర్తి కుటుంబం నివాసం ఉంటుండగా.. గత నెల చివర్లో ఆమె తల్లి, అక్కతో పాటు సోదరుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే.. వేద కృష్ణమూర్తికి మాత్రం నెగటివ్ రావడంతో.. ఆమె వెంటనే బెంగళూరుకి వెళ్లిపోయింది. వేద కృష్ణమూర్తి తల్లి చిక్‌మగళూరులోని ఆసుపత్రిలో కరోనాకి చికిత్స పొందుతూ గత నెల 23న మృతి చెందారు. సోదరి వాత్సల శివకుమార్ కూడా చికిత్స పొందుతుండగా.. ఆమెకి ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. దాంతో.. గత నెల చివరి నుంచి ఆమెని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. కోలుకుంటున్నట్లు కనిపించిన ఆమె బుధవారం రాత్రి మృతి చెందింది. దాంతో.. రెండు వారాల వ్యవధిలోనే అమ్మ, అక్కని కోల్పోయిన వేద కృష్ణమూర్తి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అక్క మృతిపై వేద కృష్ణమూర్తి స్పందిస్తూ ‘‘అక్కకి వీడ్కోలు చెప్పాల్సి రావడం చాలా బాధించింది. రెండు వారాల్లో నా ప్రపంచం ఓ పెద్ద కుదుపునకి లోనైంది’’ అని చెప్పుకొచ్చింది. ఇంట్లో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. బెంగళూరుకి వెళ్లిపోయిన వేద కృష్ణమూర్తి.. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దాంతో.. తల్లి, అక్క కడసారి చూపునకి కూడా వేద కృష్ణమూర్తి నోచుకోలేకపోయింది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment