మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన రెజ్లర్ సుశీల్ కుమార్
https://ift.tt/3oyf3C4
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత రెజ్లర్‌గా కొనసాగుతున్న సుశీల్ కుమార్.. ముందస్తు బెయిల్ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో యువ రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. మోడల్ టౌన్ ఏరియాలోని ఓ ప్లాట్ విషయమై ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో.. సాగర్ దండక్, అతని మిత్రులపై , అతని టీమ్ స్టేడియం ఆవరణంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దాంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాగర్ చనిపోయాడు. సాగర్ దండక్ మృతితో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆ రోజు నుంచి సుశీల్ కుమార్, అతని టీమ్ కోసం వెతుకుతున్నారు. కానీ.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రెజ్లర్.. పోలీసులకి దొరకలేదు. దాంతో.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు.. ఆ తర్వాత సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌ని జారీ చేశారు. అయినప్పటికీ సుశీల్ కుమార్ అజ్ఞాతం వీడలేదు. దాంతో.. ఆఖరికి సుశీల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో.. సుశీల్ కుమార్ మంగళవారం తనకి ముందస్తు బెయిల్ మంజారు చేయాలని రోహినీ కోర్టుని ఆశ్రయించాడు. అతని పిటీషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటికే సీరియస్‌గా స్పందించింది. గతంలో రెజ్లర్లంటే గూండాలనే వారని చెప్పుకొచ్చిన సమాఖ్య.. ఇప్పుడిప్పుడే రెజ్లర్లపై గౌరవం పెరుగుతోందని వెల్లడించింది. కానీ.. తాజాగా సుశీల్ కుమార్ గొడవ.. మళ్లీ రెజ్లర్ల పరువు తీసిందని సమాఖ్య పెదవి విరిచింది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment