రెజ్లర్ సుశీల్ కుమార్‌పై లుకౌట్ నోటీసులు.. మర్డర్ కేసు
https://ift.tt/3hgxSI9
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. సాగర్ అతని మిత్రులపై టీమ్ హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ దాడిలో సాగర్ తలకి తీవ్ర గాయమవగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. అతని కోసం గాలించారు. సాగర్ మృతి చెందిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ఐదు రోజుల పాటు ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలించిన పోలీసులు.. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి సుశీల్ కుమార్‌తో సాగర్‌కి మంచి సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశీల్ ఇంట్లోనే అద్దెకి ఉన్న సాగర్.. ఇటీవల ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అద్దె విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగి.. అది హత్యకి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య సీరియస్‌గా స్పందించింది. గతంలో రెజ్లర్లంటే గూండాలనే వారని చెప్పుకొచ్చిన సమాఖ్య.. ఇప్పుడిప్పుడే రెజ్లర్లపై గౌరవం పెరుగుతోందని వెల్లడించింది. కానీ.. తాజాగా సుశీల్ కుమార్ గొడవ.. మళ్లీ రెజ్లర్ల పరువు తీసిందని సమాఖ్య పెదవి విరిచింది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment