బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెకి కరోనా పాజిటివ్
https://ift.tt/2RoEadM
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె(65)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన .. భారత్‌కి చాలా టోర్నీల్లో పతకాల్ని అందించాడు. రిటైర్మెంట్ తర్వాత బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)కి ఛైర్మన్‌గానూ పనిచేసిన ప్రకాశ్ పదుకొణె.. కరోనా కారణంగా తాజాగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అతని కూతురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. 1970-80లో ప్రకాశ్ పదుకొణె అత్యుత్తమ ఆటతీరుతో భారత్‌కి చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు. బ్యాడ్మింటన్ పరంగా భారత్‌కి ఆ దశాబ్దం స్వర్ణయుగంగా చెప్తుంటారు. 1980లో ఫస్ట్ ప్రకాశ్ పదుకొణె ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలుపొందగా.. 2001 వరకూ ఎవరూ ఆ ఫీట్‌ని సాధించలేకపోయారు. 2001లో పుల్లెల గోపీచంద్ మళ్లీ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ని గెలుపొందాడు. ప్రస్తుతం గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రకాశ్ పదుకొణె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment